మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో
BY Telugu Gateway20 Jan 2019 4:18 PM GMT
X
Telugu Gateway20 Jan 2019 4:18 PM GMT
సినీ పరిశ్రమలో తన అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు మరో వారసుడొస్తున్నాడు. ఆయన వస్తున్నది మెగా ఫ్యామిలీ నుంచే. మెగా మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ ఇఫ్పటికే పరిశ్రమలోకి అడుగుపెట్టి పలు సినిమాలు చేయగా.. ప్రస్తుతం ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ వంతు వచ్చింది. ఆయన నటించే చిత్రానికి సోమవారం ముహుర్తం ఫిక్స్ కాగా.. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. వైష్ణవ్ తేజ్ జాలరి గెటప్‌లో ఉన్న ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. జనవరి 21న జరిగే ముహుర్తపు కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనుండగా.. మిగతా మెగాహీరోలు కూడా హాజరుకానున్నారు.
Next Story