అమీజాక్సన్ ఎంగేజ్ మెంట్
BY Telugu Gateway2 Jan 2019 6:00 PM IST

X
Telugu Gateway2 Jan 2019 6:00 PM IST
టాలీవుడ్ ప్రేక్షకులకు అమీజాక్సన్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. తాజాగా రజనీకాంత్ 2.ఓలో యంతరలోకపు సుందరిగా సందడి చేసిన ఈ భామ త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఫోటో ద్వారా వెల్లడించింది. నూతన సంవత్సరం తొలిరోజున నిశ్చితార్ధం జరుపుకున్నట్టు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనయటోతో జాంబియాలో ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలిపారు. ఎంగేజ్మెంట్ రింగ్‌తో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసిఉన్న ఫోటోను అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. తెలుగులో ఆమె ఎవడు, అభినేత్రి చిత్రాల్లో మెప్పించిన అమీ జాక్సన్ 2.ఓలోనూ నటించారు.
Next Story



