Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ కొత్త రికార్డు

అల్లు అర్జున్ కొత్త రికార్డు
X

టాలీవుడ్ లో స్ట్రైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరో అల్లు అర్జున్. ఈ హీరో ఇప్పుడు ఎవరూ అందుకోలేని రీతిలో కొత్త రికార్డు చేరుకున్నారు. ఈ రికార్డుపై ఆయన కూడా చాలా హుందాగా స్పందించారు. అది ఏంటి అంటే ట్విట్టర్ లో అల్లు అర్జున్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 30 లక్షలు (మూడు మిలియన్ల)కు చేరింది. దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. ఇది నా బలం కాదు. మీ ఆశీర్వాదం అంటూ ట్వీట్ చేశారు. తనకు ఇంత భారీ మొత్తంలో మద్దతు పలుకుతున్న అభిమానులకు ఆయన కృతజ్ణతలు తెలిపారు.

నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా అల్లు అర్జున్ తాజా సినిమా. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడ ఈ హీరో మూడవ సారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి కొత్త సినిమాకు రెడీ అవుతున్నారు. గతంలో వీరిద్దరూ కలసి చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

Next Story
Share it