వైసీపీకి ఆదిశేషగిరిరావు గుడ్ బై
BY Telugu Gateway8 Jan 2019 10:23 AM GMT

X
Telugu Gateway8 Jan 2019 10:23 AM GMT
ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో వైసీపీకి షాక్. ఆ పార్టీలో తొలి నుంచి ఉన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీని వీడారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ కు లేఖ రాశారు. ఏడాదికి పైగా సాగిన జగన్ పాదయాత్ర ముగింపు సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం. త్వరలోనే ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆదిశేషగిరి కోరుకుంటున్న సీటు....జగన్ ఆఫర్ చేసిన సీటు మధ్య వ్యత్యాసం ఉండటంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని కోరినట్లు చెబుతున్నారు.
Next Story