Telugu Gateway
Politics

‘ఆధార్’తో ఆ దేశాలు వెళ్లొచ్చు

‘ఆధార్’తో ఆ దేశాలు వెళ్లొచ్చు
X

సహజంగా ఏ విదేశీ పర్యటన చేయాలన్నా పాస్ పోర్టు తప్పనిసరి. అంతే కాదు..కొన్ని దేశాలకు వీసా ఉంటే దేశంలో అడుగుపెట్టనివ్వరు. మరికొన్ని ఆ దేశానికి వెళ్లాక కూడా వీసా తీసుకునే వెసులుబాటు (వీసా ఆన్ అరైవల్) సౌకర్యం కల్పిస్తాయి. భారతీయులకు ఇప్పుడు మరో కొత్త వెసులుబాటు వచ్చింది. ఆధార్ కార్డు ఉంటే చాలు భారతీయులు రెండు దేశాలు తిరగొచ్చు.

అవే నేపాల్, భూటాన్. 15 నుంచి 65 సంవత్సరాల వయస్సు వారు ఆధార్ కార్డు పెట్టుకుని నేపాల్, భూటాన్ వెళ్లొచ్చని చెబుతూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జరీ చేసింది. గతంలో కూడా పాస్ పోర్టు, ఓటర్ కార్డు, పాన్ కార్డులతో ఆయా దేశాల్లోకి అనుమతించేవారు. ఇప్పుడు ఆధార్ కూడా వాటికి జత అయింది. ఫ్యామిలీతో కలసి వెళ్ళే సమయంలో ఒక్కరికి ఫోటో గుర్తింపు కార్డు, పాస్ పోర్టు ఉన్నా సరిపోతుందని తెలిపారు.

Next Story
Share it