Telugu Gateway
Cinema

‘యాత్ర’ సినిమా ఫిబ్రవరికి వాయిదా

‘యాత్ర’ సినిమా ఫిబ్రవరికి వాయిదా
X

టాలీవుడ్ లో ఇది రాజకీయ బయోపిక్ ల సీజన్. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిల జీవిత చరిత్రలతో సినిమాలు శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ డిసెంబర్ లో విడుదల కావాల్సిన వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో కూడిన సినిమా ‘యాత్ర’ విడుదల ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ సినిమాలో వైఎస్ పాత్రను మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ పాదయాత్ర ప్రముఖ అంశంగా ఉండనుంది.

ఇందులో జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్‌ అవుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ కూడా రెండు భాగాలుగా జనవరిలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తూ సినిమాను ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు.

Next Story
Share it