‘పవన్’ కు ఊహించని విరాళం
BY Telugu Gateway24 Dec 2018 3:55 PM GMT

X
Telugu Gateway24 Dec 2018 3:55 PM GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ‘ఊహించని’ విరాళం అందింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా...నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ ఏకంగా కోటి రూపాయల విరాళం అందజేశారు. దీనిపై విదేశీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విరాళం ‘క్రిస్మస్’కు వచ్చిన ఆకస్మిక బహుమతిలా ఉందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
వరుణ్ తేజ్, నాగబాబులు విరాళం అందించటం ఎంతో సంతోషంగా ఉందని..పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్లిద్దరిని వ్యక్తిగతంగా కలుస్తానని పవన్ పేర్కొన్నారు. ఇప్పటికే జనసేనకు పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి నాలుగు లక్షల రూపాయల విరాళం అందజేశారు.
Next Story