Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెటీఆర్..కెసీఆర్ కీలక నిర్ణయం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెటీఆర్..కెసీఆర్ కీలక నిర్ణయం
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కెసీఆర్ తన కుమారుడు కెటీఆర్ కు అన్ని రూట్లలో మార్గం సుగమం చేస్తున్నారు. ఆయనకు అత్యంత కీలకమైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం ఉదయమే ఈ నిర్ణయం వెలువడింది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పేరుతో కెసీఆర్ తన బాధ్యతలు అన్నీ తనయుడికి అప్పగిస్తున్నారు. త్వరలోనే కెసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా తన కుమారుడికి అప్పగిస్తారని పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. అయితే అది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉంటుందా? లేక ముందే ఉంటుందా?అన్నది వేచిచూడాల్సిందే. తాజాగా దక్కిన అప్రతిహత విజయంతో కెసీఆర్ తాను అనుకున్న విధంగా వేగంగా పావులు కదుపుతున్నారు. భవిష్యత్ లో తన కుమారుడి పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు.

టీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో కెటీఆర్, హరీష్ రావుల మధ్య ఆదిపత్య పోరు ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదేమీలేదని అటు కెటీఆర్, హరీష్ లు ప్రకటించినా ఈ చర్చ సాగుతూనే ఉంది. ఇప్పుడు ఎలా శషబిషలకు తావులేకుండా పార్టీలో తన కుమారుడే సుప్రీం అని తేల్చిచెప్పారు కెసీఆర్. దీంతో రాబోయే రోజుల్లో హరీష్ రావు పాత్ర మరింత పరిమితం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రారంభం నుంచి పార్టీ నిర్మాణంలో కెసీఆర్ తోపాటు హరీష్ రావు కూడా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మారిన పరిణామాల నేఫథ్యంలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గటం ఖాయం అని చెబుతున్నారు. అసలు ఇఫ్పటి వరకూ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవే లేవు. కెటీఆర్ కోసం కొత్తగా ఈ పదవి ఏర్పాటు చేశారు.

Next Story
Share it