ఫిరాయింపు ఎమ్మెల్సీలపై టీఆర్ఎస్ ఫిర్యాదు
BY Telugu Gateway17 Dec 2018 7:03 AM GMT

X
Telugu Gateway17 Dec 2018 7:03 AM GMT
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు వేయటానికి అవసరమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వారిపై మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు సోమవారం నాడు ఫిర్యాదు చేసింది. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములు నాయక్, కొండా మురళిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
అయితే వీరిపై వేటు వేయాల్సిందిగా టీఆర్‌ఎస్ నాయకులు చైర్మన్ స్వామిగౌడ్ కు ఫిర్యాదు చేశారు. స్వామి గౌడ్‌ను కలిసిన వారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పొతూరి సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఉన్నారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story