‘సైరా’లో తమన్నా ఫస్ట్ లుక్ విడుదల
తమన్నా పుట్టిన రోజు సందర్భంగా సైరా చిత్ర యూనిట్ సినిమాలో ఆమె పాత్రకు సంబంధిచింన ఫస్ట్ లుక్ ను శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రమే ఈ సైరా నరసింహారెడ్డి అన్న సంగతి తెలిసిందే. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను... రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. సినిమాలో తమన్నా పాత్ర పేరును లక్ష్మిగా పరిచయం చేశారు. ఈ సినిమా 2019 వేసవిలో సందడి చేయనుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.