టీఆర్ఎస్ కు మరో షాక్
BY Telugu Gateway2 Dec 2018 3:58 PM IST

X
Telugu Gateway2 Dec 2018 3:58 PM IST
అత్యంత కీలకమైన నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో నల్లగొండ నియోజకవర్గానికి చెందిన మాజీ ఇన్ ఛార్జి దుబ్బాక నర్సింహారెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన తనకు టిక్కెట్ల రాలేదనే అసంతృప్తితో ఉన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కెసీఆర్ కు పంపారు. త్వరలోనే దుబ్బాక నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరే అవకాశం ఉందని సమాచారం. దుబ్బాక నర్సింహారెడ్డి నల్లగొండతోపాటు నకిరేకల్ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలరని చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజులు ముందు ఈ పరిణామం టీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురిచేస్తోంది.
Next Story