అల్లు అర్జున్ పై సూపర్ స్టార్ ప్రశంసలు
BY Telugu Gateway16 Dec 2018 7:56 AM GMT
X
Telugu Gateway16 Dec 2018 7:56 AM GMT
అల్లు అర్జున్. టాలీవుడ్ లోనే కాకుండా మళయాళంలోనూ ఎంతో పాపులర్ హీరో. వరస విజయాలతో దూసుకెళుతున్న ఈ హీరోపై బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఎవరో కాదు..షారుఖ్ ఖాన్. శుక్రవారం సినిమా జీరోతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న షారుఖ్ ప్రమోషన్‌లో భాగంగా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
‘బన్నీ చాలా టాలెంటెడ్ త్వరలోనే తనని కలిసి టైం స్పెండ్ చేస్తా’నన్నాడు షారుఖ్. ఆనంద్ ఎల్‌రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు హీరోల్లో ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో అల్లు అర్జున్.
Next Story