ఇక అంతే..ఓ నాలుగేళ్లు కెసీఆర్ ను విమర్శించను

ఇది ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం. విమర్శలపై తనకు తాను ఓ నాలుగేళ్ళ పాటు మారిటోరియం పెట్టుకున్నారట. ముఖ్యమంత్రి కెసీఆర్ తోపాటు కెసీఆర్ కుటుంబ సభ్యులు,మంత్రులు ఎవరిపై విమర్శలు చేయనని చెబుతున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ముందు పోలీసులు ఆయన్ను అక్రమ వీసాల కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆయన పోరాడి విజయం సాధించారు.
అయితే ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్నలేదని చెబుతున్నారు. అయితే తనకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి సహకారంతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని చెప్పారు. ప్రభుత్వం సహకరించినా.. సహకరించకపోయినా తన వైఖరిలో మార్పు ఉండదన్నారు.