Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు సజ్జన్ కుమార్ రాజీనామా

కాంగ్రెస్ కు సజ్జన్ కుమార్ రాజీనామా
X

సిక్కుల ఊచకోత కేసులో జీవిత శిక్ష పడిన సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1984లో జరిగిన అల్లర్లలో ఆయన పాత్ర ఉందని ఢిల్లీ కోర్టు తేల్చింది. తాజాగా ఈ మేరకు తీర్పు వెలువరించిన ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 31లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు విధించిన జీవిత ఖైదుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలనే యోచనలో ఆయన ఉన్నారు. అయినా సరే రాజకీయ విమర్శలకు ఛాన్స్ లేకుండా ఉండేందుకు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఇప్పటికే అధికార బిజెపి ఈ అల్లర్లలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని..ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కమల్ నాధ్ పై కూడా బిజెపి విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఒక్క సజ్జన్ కుమార్ కు మాత్రమే కాదు...గాంధీ కుటుంబానికి కూడా శిక్ష పడాల్సి ఉందని బిజెపి ఆరోపిస్తోంది.

Next Story
Share it