Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘ఆర్ఆర్ఆర్‘ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

0

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు రాజమౌళినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎన్టీఆర్,  రామ్ చరణ్ లతో తెరకెక్కుతున్న సినిమా వర్కింగ్ టైటిల్ ఆర్ఆర్ఆర్ గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోలతో కూడిన యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో పూర్తి చేశారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ఎప్పుడనేది కూడా వెల్లడించనున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పేర్లు పలు ప్రచారంలో ఉన్నా..ఇంత వరకూ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. త్వరలోనే ఆ వివరాలు కూడా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో కీర్తి సురేష్, పూజా హెగ్డెలు నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తన సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని తాను..ఓటింగ్ లో పాల్గొంటున్నానని..రేపటి భవిష్యత్ కోసం అందరూ ఓటు వేయాలని రాజమౌళి ట్వీట్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.