Telugu Gateway
Cinema

సినిమా చంద్రబాబును చూశారా!

సినిమా చంద్రబాబును చూశారా!
X

ఆయన సినిమా చంద్రబాబు. ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబునాయుడి పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా రానా పుట్టిన రోజు సందర్భంగా మరో లుక్ ను విడుదల చేసింది. సీరియస్ గా చేయి పైకెత్తి ఉన్న రానా ఫోజు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర విశేషాలు నిత్యం ఏదో ఒకటీ వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై హైప్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకే నెలలో అంటే జనవరి 9న సినిమా తొలి భాగం కథానాయకుడు, జనవరి 24న మహానాయకుడు భాగాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 16న సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 21న చిత్ర ఆడియోను ఎన్టీఆర్ పుట్టిన గ్రామం అయిన నిమ్మకూరులో విడుదల చేయనున్నారు.

Next Story
Share it