Top
Telugu Gateway

రకుల్ డ్యాన్స్ హంగామా

రకుల్ డ్యాన్స్ హంగామా
X

రకుల్ ప్రీత్ సింగ్ కు ఫిట్ నెస్ అంటే ప్రాణం. తానొక్కటే ఫిట్ గా ఉండటమే కాకుండా..ఎక్కువ మందిని ఆ దిశగా నడిపించేందుకు ఓ సంస్థతో కలసి హైటెక్ జిమ్ ను కూడా రకుల్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పూర్లి స్లిమ్ గా మారిపోయి..డ్యాన్స్ తో అదరగొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొరియోగ్రాఫర్ తో కలసి రకుల్ ఈ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను రకుల్ స్వయంగా షేర్ చేసుకున్నారు. ‘మీ ప్రయాణంలో ఎక్కువ అవకాశాలు తీసుకోండి.

ఎక్కువగా డ్యాన్స్ చేయండి. ధన్యవాదాలు గుల్నాజ్ ఖాన్ . ఓ రోజు నేనూ మీలాగా చక్కగా డ్యాన్స్ చేయగలుగుతానని ఆశిస్తున్నా. అప్పటి వరకూ డ్యాన్స్ నేర్చుకుంటానే ఉంటా’ అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో కూడిన వీడియోను గుల్నాజ్ ఖాన్ కూడా షేర్ చేశారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ స్టెప్స్ సూపర్ గా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. ఈ వీడియోను ఇప్పటికే ఆరున్నర లక్షలకు మందిపైగా వీక్షించారు.

https://www.youtube.com/watch?v=OAusJIJx5Lg

Next Story
Share it