Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ బయోపిక్ ‘రాజర్షి’ పాట విడుదల

ఎన్టీఆర్ బయోపిక్ ‘రాజర్షి’ పాట విడుదల
X

ఎన్టీఆర్ గా ఆయన పాత్రను బాలకృష్ణ ఎలా పోషించాడన్నది సినిమా చూస్తే కానీ తెలియదు. కానీ ఈ సినిమాకు సంబంధించి వెలువడిన రెండు పాటలు మాత్రం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించి ఇప్పటికే తొలి పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. చిత్ర యూనిట్ ఇప్పుడు మరో కొత్త పాటను విడుదల చేసింది. గంభీరమైన పదాలతో సాగిన ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ సినిమాలోని తల్లి ఏదీ? తండ్రీ ఏడీ? అడ్డుతగిలే బంధమేదీ అంటూ సాగే రాజర్షి పాట విడుదలైంది.

ఇది ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమాకు కీరవాణి సంగీతం ఓ హైలెట్ గా నిలవనుంది. ఈ విషయాన్ని విడుదలైన రెండు పాటలూ నిరూపించాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే భారీ తారాగణం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. ఈ సినిమాను బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ బికె ఫిల్మ్స్ పేరుతో ఈ నిర్మాణం చేపట్టారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది.

https://www.youtube.com/watch?time_continue=255&v=iQckakGluQ0

Next Story
Share it