ప్రభాస్ ‘సాహో’ విడుదల తేదీ వచ్చేసింది
BY Telugu Gateway17 Dec 2018 10:32 AM GMT
X
Telugu Gateway17 Dec 2018 10:32 AM GMT
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. బాహుబలి తర్వాత డార్లింగ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ‘సాహో’ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ వెల్లడించింది. బాహుబలి అంత స్థాయిలో కాకపోయినా సాహో సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నదే. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాహుబలి సినిమా రెండు భాగాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ చేస్తున్న తదుపరి సినిమా ఇదే కావటంతో ఈ సినిమాపై ఆయన అభిమానుల్లో అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
Next Story