Telugu Gateway
Cinema

దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ ట్రైలర్

దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ ట్రైలర్
X

ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ ను అరవై లక్షల మంది వీక్షించారు. శక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించగా..ఇందులో ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ పోషించిన సంగతి తెలిసిందే. భారీ తారగణంతో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమాలో పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ నటించిన బాలకృష్ణ ‘అరవై ఏళ్ళు వస్తున్నాయి. ఇన్నాళ్ళు మా కోసం బతికాం. ఇక ప్రజల కోసం..ప్రజాసేవలో బతకాలి అనుకుంటున్నాం’ అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించి ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం కథనాయకుడు జనవరి 9న విడుదల కానుంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన సినిమా మహానాయకుడు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=1-2J7avI9W8

Next Story
Share it