Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ విడుదల వాయిదా

ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ విడుదల వాయిదా
X

ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదలలో మార్పులు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తొలి భాగం కధానాయకుడు. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండవ భాగం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రకు సంబంధించిన భాగం ‘మహానాయకుడు’. ఇది కూడా జనవరి 24న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ విడుదలను ఫిబ్రవరి 7కి మార్చినట్లు సమాచారం. అయితే ఈ తేదీల మార్పునకు కారణలేంటో తెలియరాలేదు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను స్వయంగా బాలకృష్ణ పోషించటంతోపాటు..స్వయంగా నిర్మిస్తున్నారు కూడా. ఈ చిత్రంలో పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రను నిత్యామీనన్ దక్కించుకున్నారు. ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు.

Next Story
Share it