‘వెన్నుపోటు’ ఫస్ట్ లుక్ అంటున్న వర్మ
BY Telugu Gateway19 Dec 2018 1:26 PM IST
X
Telugu Gateway19 Dec 2018 1:26 PM IST
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో కొత్త వివాదానికి తెరలేపటానికి రెడీ అయిపోతున్నారు. అందులో భాగంగానే ‘వెన్నుపోటు’ ఫస్ట్ లుక్ విడుదల చేయటానికి రెడీ అయిపోయారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నుపోటు పాట ఫస్ట్ లుక్‌ను డిసెంబర్ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు వర్మ.
ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సెన్సేషన్ సృష్టించిన వర్మ.. ఇప్పుడు వెన్నుపోటు పోస్టర్ ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. ఎన్నికల ముందు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
Next Story