Top
Telugu Gateway

అట్టహాసంగా కెటీఆర్ బాధ్యతల స్వీకరణ

అట్టహాసంగా కెటీఆర్ బాధ్యతల స్వీకరణ
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. టీఆర్ఎస్ భవన్ ఉన్న మార్గంలో ట్రాఫిక్ ను మళ్ళించి వేలాది మంది కార్యకర్తలు..నేతలు వెంట రాగా కెటీఆర్ టీఆర్ఎస్ భవన్ లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద హంగామానే చేశారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం తెలంగాణ భవన్‌లో సోమవారం ఉదయం సరిగ్గా 11:56 నిమిషాలకు ఆయన బాధ్యతలు చేపట్టారు.

తెలంగాణ భవన్‌ వరకు భారీ ర్యాలీగా చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దాదాపు 20వేలకు పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్‌ వద్దకు తరలివచ్చారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, బతుకమ్మ ఆటలతో టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరైయ్యారు.

Next Story
Share it