కొండా సురేఖ ఓటమి
BY Telugu Gateway11 Dec 2018 12:10 PM IST

X
Telugu Gateway11 Dec 2018 12:10 PM IST
తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు అనూహ్య ఫలితాలు ఇచ్చాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తాము ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోకవర్గం నుంచి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. ఆమె ఇటీవల వరకూ టీఆర్ఎస్ లో ఉండి..తొలి జాబితాలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ తనకు టిక్కెట్ కేటాయించకపోవటంతో నిరసన వ్యక్తం చేసి కాంగ్రెస్ లో చేరారు. అయినా ఆమెకు ఫలితం దక్కలేదు. వస్తున్న ఫలితాలు చూస్తుంటే తెలంగాణలో టీఆర్ఎస్ వేవ్ ఉన్నట్ల కన్పిస్తోంది. కాంగ్రెస్ మహామహులు అనుకన్న వాళ్లు కూడా పరాజయం బాట పట్టారు. కొండా సురేఖ పై టీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి విజయం సాధించారు.
Next Story



