ఎంపీగా పోటీచేస్తా
BY Telugu Gateway16 Dec 2018 4:04 PM IST

X
Telugu Gateway16 Dec 2018 4:04 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం నాడు మీడియా ముందుకొచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీ బరిలో ఉంటానని ప్రకటించారు. అందరి ఆశీస్సులతో తాను ఎంపీగా విజయం సాధిస్తానని పేర్కొన్నారు. గత ఇరవై సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిగా తన జీవితం ప్రజాసేవకే అంకితమని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు పోటీ చేయాలని తాను ఎపుడో నిర్ణయించుకున్నట్లు, ఈ విషయం రాహుల్ గాంధీతో చెప్పగా సరేనన్నారని తెలిపారు.
కొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే సర్పంచ్ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకొని ఎక్కువ సర్పంచ్‌లను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో సర్పంచ్‌లకు నిధులు ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ఆరోపించారు.
Next Story



