కెసీఆర్ రియాక్షన్ ఇదీ

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ సిద్ధిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. తర్వాత కెసీఆర్ మీడియాతో మాట్లాడారు. తిరిగి అధికారం నిలబెట్టుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని, భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రభంజనం సృష్టిస్తామని చెప్పారు. ఈసారి పోలింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు.
‘ప్రభుత్వ అనుకూల పవనాలు చాలా బాగా వీస్తున్నాయి. మేము ముందు నుంచి చెబుతున్నట్టుగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. మాకు ఎటువంటి అనుమానం లేదు మళ్లీ ప్రజా అనుకూల ప్రభుత్వమే వస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం మీరే చూస్తారు. ఈసారి పోలింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్‌లో భారీగా పోలింగ్ నమోదవుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నార’ని కేసీఆర్ తెలిపారు.