ఎన్టీఆర్ ఫస్ట్ సాంగ్ అదరగొడుతోంది
తెలుగు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన హీరోల్లో నందమూరి తారకరామారావు ముందు వరసలో ఉంటారు. ఎందుకంటే ఆయన సత్తా అలాంటిది. ఇప్పుడు అలా చరిత్ర పురుషుడి సినిమా బయోపిక్ గావస్తోంది. అందులో నటిస్తున్నది ఎన్టీఆర్ తనయుడి బాలకృష్ణ అన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో నిలివనున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను ఆదివారం నాడు విడుదల చేశారు. బాలయ్య తొలిసారినిర్మాతగా మారి తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు చారిత్రక సినిమాల తెరకెక్కించటంలో సత్తా చాటుకున్న క్రిష్ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈసినిమా తొలిభాగం యన్.టి.ఆర్ కథానాయకుడు.
సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన తొలిపాటను రచయితలు శివ శక్తిదత్తా, కే రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో పాటను రచించారు. కీరవాణి సంగీత సారధ్యంలో బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ ఈ పాటను ఆలపించారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండవ భాగం మహానాయకుడిగా తెరకెక్కనుంది.
https://www.youtube.com/watch?v=QxdFY0qUrkc