ఎన్నికల ప్రచారానికి దూరంగా ఎన్టీఆర్

గత కొంత కాలంగా టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా దూసుకెళుతున్న ఎన్టీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. స్వయంగా తన సోదరి నందమూరి సుహసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలో నిలుచున్నా ఆయన మాత్రం ప్రచారానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు బహిరంగంగా ఇచ్చిన మద్దతు లేఖతోనే సరిపెడతారని..ప్రచారానికి రారనే విషయాన్ని తెలుగుగేట్ వే. కామ్ చాలా ముందుగానే స్పష్టం చేసింది.
కానీ అదిగో ఎన్టీఆర్ ప్రచారం..ఇదిగో ప్రచారం అంటూ కొన్ని పత్రికలు..ఛానళ్లలో వార్తలు హంగామా చేశాయి.
అసలు విషయం మాత్రం ఇప్పుడు తేలిపోయింది. అయితే సుహాసిని తరపున ఆమెను బరిలో నిలిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుహసిని బాబాయ్ బాలక్రిష్ణలు మాత్రం రోడ్ షోలు నిర్వహించనున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూకట్ పల్లి సీటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది.దీనికి కారణం ఇక్కడ ఉంచి హరిక్రిష్ణ కుమార్తె బరిలో ఉండటం ఒకెత్తు అయితే..ఆమెకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల మద్దతు లభిస్తుందా లేదా అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సీటు గెలుపుపై బెట్టింగ్ లు కూడా భారీ ఎత్తున సాగుతున్నాయి.