Telugu Gateway
Politics

ఆరోగ్యం బాగాలేని ‘అమ్మ’ 1.17 కోట్ల ఆహారం తిన్నారట!

ఆరోగ్యం బాగాలేని ‘అమ్మ’ 1.17 కోట్ల ఆహారం తిన్నారట!
X

వినటానికి వింతగా ఉన్నా నమ్మితీరాల్సిందే. ఎందుకంటే ఇది చెన్నయ్ అపోలో ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన బిల్లు లెక్క మరి. ఆమె ఆస్పత్రి బిల్లు మొత్తం 6.85 కోట్ల రూపాయలు. అందులో కేవలం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆహార ఖర్చులే 1.17 కోట్ల రూపాయలు చూపించారు. ఎంత కాలానికి అంటే..ఆమె ఆస్పత్రిలో 75 రోజులు ఉన్నారు. ఈ ఆహార ఖర్చులతో కలుపుకుని మొత్తం అపోలో ఆస్పత్రి వేసిన బిల్లు ఎంతో 6.85 కోట్ల రూపాయలు. ఈ వివరాలు అన్నీ అపోలో ఆస్పత్రి యాజమాన్యమే అమ్మ మృతిపై విచారణ చేస్తున్న కమిటీకి అందజేసింది.

ప్రస్తుతం ఈ వివరాలు అన్నీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి . అంతే కాదు...ఈ బిల్లు చూసి అపోలో యాజమాన్యంపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో మండిపడపుతున్నారు. జయలలితకు వైద్య సేవలు అందించిన బ్రిటన్ డాక్టర్ రిచర్డ్ బేలేకు 92 లక్షల రూపాయల చెల్లింపులు చేసినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. జయలలిత మరణం తర్వాత అపోలో యాజమాన్యానికి అన్నాడీఎంకె పార్టీ 6 కోట్ల రూపాయల మొత్తం చెల్లించింది. ఇంకా బిల్లు కొంత పెండింగ్ లో ఉంది. ఈ నివేదిక లీక్ పై అపోలో యాజమాన్యం విచారణ ప్రారంభించామని చెబుతోంది.

Next Story
Share it