జానారెడ్డి కూడా ఔట్
BY Telugu Gateway11 Dec 2018 7:32 AM GMT

X
Telugu Gateway11 Dec 2018 7:32 AM GMT
కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు..రద్దు అయిన అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా కుందూరి జానారెడ్డి కూడా పరాజయం పాలయయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్య చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 9368 మెజారిటీతో నోముల నర్సింహయ్య విజయం సాధించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్. వాస్తవానికి ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జానారెడ్డి తాను సీఎం రేసులో కూడా ఉన్నానని బహిరంగంగా ప్రకటించారు. తీరా ఆయనే ఓటమి పాలయ్యారు.
Next Story