కెసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై చంద్రబాబు కామెంట్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఉద్దేశించి చేసిన రిటర్న్ గిఫ్ట్ ఆసక్తికరమైన చర్చ కు తెరలేపింది. అసలు ఈ గిఫ్ట్ ఏమై ఉంటుంది? ఎలా ఉంటుంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. లేదా ఏదో ఫ్లోలో సరదాగా అన్నారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే కెసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడకైనా రావచ్చు,వెళ్లవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని.. అక్కడి సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్ ఇస్తానంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి.. రావొచ్చన్నారు. ఎన్టీఆర్ తెదేపాను తెలుగుజాతి కోసం పెట్టారని చంద్రబాబు అన్నారు. కొందరు అటూ ఇటూ లాలూచీ పడొచ్చేమోగానీ.. తాము మాత్రం తెలుగువారు ఎక్కడ ఉన్నా పనిచేశామని చంద్రబాబు చెప్పారు.రిటర్న్ గిప్ట్ ఏమిటో చూడాలని ఆయన అన్నారు.