Telugu Gateway
Telangana

తెలంగాణ సీఎస్ పై సీఈసీ సీరియస్!

తెలంగాణ సీఎస్ పై సీఈసీ సీరియస్!
X

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషిపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆపద్ధర్మ సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ తో పాటు మరికొంత మంది నేతలపై ఉన్న రైల్వే కేసులను ఎత్తేస్తూ తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ మరో జీవో జారీ చేశారు. ఈ వార్తలు మీడియాలోనూ ప్రముఖంగానే వచ్చాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి.

ఎన్నికల సమయంలో ప్రభుత్వమే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించటం ఏ మాత్రం సరికాదని హెచ్చరిస్తూ సీఈసీ సీఎస్ కు లేఖ రాసింది. అసలు కేసులు ఉపసంహరించుకునే అధికారం హోం శాఖది అయితే..న్యాయ శాఖ జీవోలు ఎలా జారీ చేస్తుందనే విషయాన్ని కూడా సీఈసీ తన లేఖలో ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలని తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

Next Story
Share it