Telugu Gateway
Telangana

రజత్ కుమార్ పై సీఈసీ సీరియస్!

రజత్ కుమార్ పై సీఈసీ సీరియస్!
X

తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందా?. అంటే అవుననే చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ప్రధానంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టు విషయంలో ఆయన అనుసరించిన తీరుపై సీఈసీ అక్షింతలు వేసింది. అంతే కాదు..ఏకంగా సీఈసీని వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను అక్కడ నుంచి బదిలీ చేసింది. వెంటనే ఆ పోస్టులో అవినాష్ మహంతిని నియమించింది. ఇదొక్కటే కాదు..హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీపైనే స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలు అన్నీ ఎన్నికల అధికారి రజత్ కుమార్ పై ప్రభావం చూపించాయి. ఈ పరిణామాలు ఎన్నికల సంఘం ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఉండటంతో సీఈసీనే ఏకంగా రంగంలోకి దిగింది. సీఈసీ సీరియస్ తో రజత్ కుమార్ కూడా తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

వాస్తవానికి బుధవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగిసింది. ఎవరు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్నా ప్రచార గడువు ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి..ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలను వివరిస్తారు. కానీ ఇంతటి కీలక సమయంలో కూడా రజత్ కుమార్ బయటకు రాలేదు. దీనికి ప్రధాన కారణం సీఈసీ ఆగ్రహం ఒకటి అయితే..మీడియా ముందుకు వస్తే రేవంత్ రెడ్డి అరెస్ట్ పై మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఇబ్బందికరంగా మారతాయనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి రజత్ కుమార్ తీరు ఈ ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it