‘హన్సిక’పై కేసు
హీరోయిన్ హన్సిక చిక్కుల్లో పడ్డారు. ఓ సినిమా ఫస్ట్ లుక్ ఆమెకు ఇప్పుడు సమస్యలు తెచ్చిపెడుతుంది. హన్సిక ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘మహా’లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. అందులో హన్సిక సాధువు డ్రెస్ వేసుకుని ఓ కుర్చీలో కూర్చుని పొగతాగుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ లుక్ పై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. అయితే తాజాగా ఈ పోస్టర్ పై పీఎంకె సభ్యుడు జానకి రామన్ కేసు వేశారు. ఈ పోస్టర్ కొంత మంది మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై దర్శకుడు జమీల్ వివరణ ఇఛ్చే ప్రయత్నం చేశారు.
పోస్టర్ ప్రత్యేకంగా ఉండాలని భావించే అలా చేశాను కానీ..ఎవరి మత విశ్వాసాలను కించపర్చాలనే ఉద్దేశం తనకు లేదని..తాను మానవత్వాన్ని నమ్ముతానని పేర్కొన్నారు. అంతే కానీ హిందు, ముస్లింను కాదన్నారు. ఈ అంశంలో దయచేసి మతం, కులాల అంశాన్ని తెరపైకి తేవద్దని కోరారు. ఈ మేరకు డైరక్టర్ సోషల్ మీడియా పోస్టు చేయగా..ఆయన పోస్ట్ ను హన్సిక రీట్వీట్ చేశారు. ఈ సినిమా హన్సికకు ప్రత్యేకం. ఎందుకంటే ఆమెకు ఇది 50వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. వీరి వివరణతో ఈ అంశం మరుగుపడిపోతుందా? లేక మరింత ముందుకు సాగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే.