Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబుకు బిగ్ షాక్...టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ రాం రాం?!

చంద్ర‌బాబుకు బిగ్ షాక్...టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ రాం రాం?!
X

బాబోయ్ మాకొద్దు చంద్రబాబుతో ఈ పొత్తు అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఏకంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సర్వేలోనే సంచలన విషయాలు తేలాయా?. అంటే ఔననే చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 70 శాతం మేర తుడిచిపెట్టుకుపోయినట్లు కాంగ్రెస్ సర్వేలో తేలినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయం తామేదో కనిపెట్టింది కాదని..రాహుల్ గాంధీ స్వయంగా నిర్ధారించుకున్న అంశం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బిగ్ షాక్ తగలనుందనే సంగతి స్పష్టం అవుతోంది. అయితే ఈ పొత్తు తెగతెంపులు కేవలం రాష్ట్ర స్థాయిలోనే ఉంటాయా? లేక జాతీయ స్థాయిలో కూడా ఉంటాయా? అన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి మోడీ వ్యతిరేక ఫ్రంట్ అంటూ హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటాన్నే చాలా మంది తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ తన తనంతట తాను చంద్రబాబుతో పొత్తుకు రాం రాం చెపితే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుంది. ఏపీలో పెద్దగా కాంగ్రెస్ కు పట్టులేకపోయినా..ఉన్న ఓటు బ్యాంకును అయినా తమ వైపు తిప్పుకుందామనే ఆలోచనతో రిస్క్ అయినా చంద్రబాబు పొత్తుకు రెడీ అయిపోయారు.

ఇప్పుడు తెలంగాణలో అది కాస్తా వికటించటంతో కాంగ్రెస్ నేతలే ఎక్కువ షాక్ కు గురయ్యారు. రాబోయే పంచాయతీ ఎన్నికలు కానివ్వండి..లోక్ సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండే అవకాశం లేదని కాంగ్రెస్ నేతలు తేల్చిచెబుతున్నారు. ఈ పరిణామాలు టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. బిజెపితో తెగతెంపులు చేసుకున్న తర్వాత చంద్రబాబు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలసి సాగుతున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా దూరం పెడితే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు కూడా లేని సమయంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు టీడీపీని ఇరకాటంలోకి నెట్టే అవకాశం కన్పిస్తోంది. పొత్తుకు బ్రేకప్ రాష్ట్ర స్థాయిలో అయితే పర్వాలేదు కానీ..జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ చంద్రబాబును దూరం పెడితే పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యాానించారు.

Next Story
Share it