Top
Telugu Gateway

అసద్..‘బుల్లెట్’ పే ఆగయా

అసద్..‘బుల్లెట్’ పే  ఆగయా
X

కారు..బుల్లెట్ రాజకీయం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అసదుద్దీన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎవరూ ఊహించని రీతిలో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు బుల్లెట్ పై వచ్చారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా..ఎవరూ పెద్దగా గుర్తు పెట్టే అవకాశం లేకుండా హెల్మెట్ ధరించి మరీ ఆయన వచ్చేశారు. భవిష్యత్ రాజకీయ పరిణామాలపై అంచనాలు..అవసరాలు..కదలికలు ఎలా ఉండాలన్న అంశంపై కెసీఆర్, అసద్ ల మధ్య చర్చలు సాగే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని ఇప్పటికే స్పష్టం చేసిన ఒవైసీ.. దేవుడి ఆశీస్సులతో ఎవరి మద్దతు లేకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మజ్లిస్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేస్తూ ఈ సమావేశానికి ముందు ట్వీట్‌ చేశారు.

జాతి నిర్మాణంలో ఇది తొలి అడుగని, తాను తెలంగాణ కేర్‌టేకర్‌ సీఎం కేసీఆర్‌ కలవబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రజాకూటమిలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్‌ ఆహ్వానించడంపై ఇప్పుడేమీ మాట్లాడలేనని భిన్నవాదనలకు తెరలేపిన ఒవైసీ.. నేడు తమ మద్దతు కేసీఆర్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. హంగ్‌ వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు సమాచారం. ఫలితాలు వెలువడే క్రమంలో కేసీఆర్‌తో ఒవైసీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story
Share it