Top
Telugu Gateway

‘అంతరిక్షం’ ట్రైలర్ వచ్చేసింది

‘అంతరిక్షం’ ట్రైలర్ వచ్చేసింది
X

తొలి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి మరో వినూత్న కథతో ముందుకొస్తున్నాడు. ‘ఘాజీ’ సినిమాతో సంకల్ప్ రెడ్డి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ సంపాదించాడో తెలిసిందే. ఘాజీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ‘అంతరిక్షం’తో ముందుకొస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ వ్యోమగామిగా నటిస్తున్నాడు. ‘అంతరిక్షం 9000 KMPH’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. డిసెంబర్‌ 21న రిలీజ్‌ కు రెడీ అవుతున్న ఈ సినిమా టైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. మిరా అనే శాటిలైట్‌ దారి తప్పటంతో ప్రపంచంలోని కంమ్యూనికేషన్‌ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది.

ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతరిక్షంలో ఆఫీసర్‌ దేవ్‌ చేసిన సాహసమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. తెలుగులో తొలి స్పేస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆస్ట్రోనాట్‌గా కనిపించేందుకు వరుణ్ తేజ్‌ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్‌ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్‌ వేశారు. వరుణ్‌ సరసన అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్‌ రెడ్డి, క్రిష్‌(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు. మరి అంతరిక్షం సినిమాతో సంకల్ప్ రెడ్డి ఎలాంటి సంచలనం నమోదు చేస్తారో వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=MTXXMDfIicA

Next Story
Share it