Telugu Gateway
Politics

మరోసారి అమెరికా ‘షట్ డౌన్’

మరోసారి అమెరికా ‘షట్ డౌన్’
X

ట్రంప్ దూకుడు నిర్ణయాలు అమెరికాను చిక్కుల్లో పడేస్తున్నాయి. ఈ పరిణామాలతో అమెరికా మరోసారి ‘షట్ డౌన్’కు గురైంది. దీంతో క్రిస్మస్ వేడుకల వేళ అమెరికాలో ఉద్యోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాకు షట్ డౌన్ కొత్తకాకపోయినా ట్రంప్ నిర్ణయాలు నిత్యం వివాదస్పదం అవుతూనే ఉన్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30 కొన్ని అత్యవసర, కీలక విభాగాలు తప్పించి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అమెరికాలో ఇలా జరగడం ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండానే, అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్‌ అడిగిన 500 కోట్ల డాలర్ల డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే శుక్రవారం కాంగ్రెస్‌ వాయిదా పడింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు సకాలంలో కాంగ్రెస్‌ అమోదం పొందకపోయినా, అధ్యక్షుడు సంతకం చేయకపోయినా పాలన స్తంభిస్తుంది. పాలన నిలిచిపోకుండా చూసేందుకు చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌ నేతలు, శ్వేతసౌధం అధికారుల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

ప్రభుత్వానికి చెందిన కొన్ని కీలక భద్రతా సంస్థలు, అత్యవసర సేవల సంస్థలు మాత్రమే ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నా యి. అమెరికా రక్షణ మంత్రి పదవికి జిమ్‌ మ్యాటిస్‌ రాజీనామా చేసిన మరుసటి రోజునే పాలన స్తంభించడంతో అమెరికాలో కల్లోలిత వాతావరణం నెలకొంది. షట్‌డౌన్‌ కారణంగా 8 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి వేత నం లేని సెలవులు లభించనుండగా, మరికొందరు జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. భారత్ లో ఎలా అయితే బడ్జెట్ ఆమోదం పొందకుండా రూపాయి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటుందో..అమెరికాలోనూ బడ్జెట్ ను ఆమోదిస్తేనే ప్రభుత్వ అవసరాలు అయినా దేనికైనా డబ్బు వాడే వెసులుబాటు లభిస్తుంది.

Next Story
Share it