Telugu Gateway
Cinema

2.ఓ@500 కోట్లు

2.ఓ@500 కోట్లు
X

రజనీకాంత్ సినిమా దుమ్మురేపింది. వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 500 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ వెల్లడించారు. ఆయన ఈ సినిమా హిందీ వెర్షన్ కు సమర్పకుడిగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూపర్ స్టార్స్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ లు నటించారు. అమీ జాక్సన్ హీరోయిన్. 2.ఓ సినిమాపై సమీక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా వసూళ్లు మాత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి.

దీంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీ. ఈ సినిమా విడుదలకు ముందే శాటిలైట్ రైట్స్ 370 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది. త్వరలో చైనాలోనూ సినిమా విడుదల కానుంది. అక్కడ ఏకంగా 56 వేల థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు. అక్కడ ఈ సినిమా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే. రజనీకాంత్ సినిమాలకు చైనాలో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it