Telugu Gateway
Politics

సంచలనం.. కెసీఆర్ ను ఓడించాలని కోరిన హరీష్!

సంచలనం.. కెసీఆర్ ను ఓడించాలని కోరిన హరీష్!
X

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ను ఓడించాలని..దీనికి అవసరమైన ఆర్థిక సాయం తాను చేస్తానని హరీష్ రావు హామీ ఇఛ్చారని అన్నారు. అవినీతి సొమ్ము తనకు అవసరం లేదని తేల్చిచెప్పినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఓ ప్రైవేట్ నెంబర్ నుంచి ఈ కాల్ వచ్చిందని..ఈ అంశంపై ఏ దేవుడి దగ్గర అయినా ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించటం సంచలనం రేపుతోంది. ఈ ఫోన్ కాల్ తనకు శుక్రవారం నాడు వచ్చిందని అన్నారు. అన్ని బాధ్యతలు కెటీఆర్ కే అప్పగిస్తూ తన పరువు తీస్తున్నారని హరీష్ రావు వాపోయారని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. కెసీఆర్ వైఖరితో తనకు రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీష్ రావు అన్నట్లు తెలిపారు.

కెసీఆర్ ను ఓడించేందుకు కలసి పనిచేద్దామని చెప్పారన్నారు. తనకు గజ్వేల్ ప్రజలు అండగా ఉన్నారని..కెసీఆర్ కుటుంబం మొత్తం వచ్చి ప్రచారం చేసినా విజయం తనదేనని ప్రతాప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ లో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కెసీఆర్, హరీష్ రావు ల మధ్య గ్యాప్ బాగా పెరిగిందని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ తరుణంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోయటం ఖాయంగా కన్పిస్తోంది. గజ్వేల్ లో టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ గెలుపు అంత సులభం కాదని..అందుకే రెండవ సీటులో పోటీకి కూడా కెసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి బాంబు పేల్చారు.

Next Story
Share it