విజయ్ తో జతకట్టనున్న జాన్వి
BY Telugu Gateway29 Nov 2018 8:16 AM GMT
X
Telugu Gateway29 Nov 2018 8:16 AM GMT
విజయ్ దేవరకొండ ఇమేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. బాలీవుడ్ లోనూ విజయ్ కు అభిమానులు పెరుగుతున్నారు. ఏకంగా శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ కూడా తనకు అవకాశం వస్తే విజయ్ దేవరకొండతో కలసి నటిస్తానని చెప్పారు. ఓ షోలో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించారు. దీనిపై విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. తాను త్వరలోనే జాన్వితో కలసి సినిమా చేస్తానని..అది కూడా కరణ్ జోహర్ సారధ్యంలోనే అని చెప్పటంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది.
కొద్ది కాలం క్రితం విజయ్ దేవరకొండ ముంబయ్ లో కరణ్ జోహార్ ఆఫీసుకు వెళ్లి కలసి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే ఈ కాంబినేషన్ లో సినిమా పక్కా అని భావిస్తున్నారు తాజాగా విడుదలైన విజయ్ దేవరకొండ సినిమా ట్యాక్సీవాలా కూడా మంచి టాక్ తో దూసుకెళుతోంది. విజయ్, జాన్వి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఏ రేంజ్ క్రేజ్ వస్తుందో ఊహించుకవోచ్చు.
Next Story