Telugu Gateway
Cinema

రామ్ చరణ్ ను దాటేసిన విజయ్

రామ్ చరణ్ ను దాటేసిన విజయ్
X

హీరో విజయ్ నటించిన ‘సర్కారు’ సినిమా రంగస్థలం రికార్డును బ్రేక్ చేసింది. సర్కారు సినిమాపై వివాదాలు ఎన్ని వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం ఇది దుమ్మురేపుతోంది. అంతే కాదు..కొత్త రికార్డులు నమోదు చేసింది. విజయ్ హీరోగా నటించిన సర్కారు రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించి రికార్డ్‌ సృష్టించింది. ఈ సినిమా ప్రస్తుతం ఈ ఏడాది దక్షిణాదిలోనే హైయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డ్‌ ను సొంతం చేసుకుంది. రెండు వారాల్లో సర్కార్‌ 225 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి 2018లో సౌత్‌లో అత్యధిక గ్రాస్‌ సాధించిన సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది.

ఇప్పటివరకూ ఈ రికార్డ్‌ టాలీవుడ్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం పేరున ఉండేది. రామ్‌ చరణ్‌, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం 218 కోట్లతో సర్కార్‌ రిలీజ్‌ కు ముందు వరకు టాప్‌ ప్లేస్‌లో ఉంది. విజయ్‌ సర్కార్‌ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఫుల్‌ రన్‌ మరిన్ని రికార్డ్‌ లు సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌. సర్కారు సినిమాలో విజయ్ కు జోడీగా కీర్తి సురేష్ నటించగా..రాజకీయ నాయకురాలి పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it