కాంగ్రెస్ కు వట్టి వసంత్ రాజీనామా
BY Telugu Gateway1 Nov 2018 3:10 PM GMT

X
Telugu Gateway1 Nov 2018 3:10 PM GMT
ఏపీ కాంగ్రెస్ లో కలకలం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఢిల్లీ భేటీ ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి, ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు వట్టి వసంతకుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలపటానికి నిరసనగానే ఆయన పదవికి రాజీనామా చేశారు.
1983 నుంచి టీడీపీతో పోరాడుతున్నామని..అలాంటి పార్టీతో కలవటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. టీడీపీకి చెందిన కొంత మంది సీనియర్ నేతలు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు ఇప్పటికిప్పుడు స్పందిస్తారా?. లేక మరికొంత కాలం వేచిచూస్తారా?. చూడాల్సిందే.
Next Story