Telugu Gateway
Telangana

డిసెంబర్ 3న టీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎంపీలు ఔట్!?

డిసెంబర్ 3న టీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎంపీలు ఔట్!?
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఈ మధ్య కాలంలో వరస షాక్ లు తగులుతున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ టాప్ టీమ్ అంతా ఈ ఎన్నికల్లో తాము 100నుంచి 106 సీట్లు గెలుస్తామని చెబుతుంటే...పార్టీ ఎంపీలు మాత్రం ‘జంపింగ్’ మోడ్ లోకి వెళుతున్నారు. తాజాగా చేవేళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ముగ్గురు ఎంపీల జంపింగ్ ఝలక్ ఉంటుందని చెబుతున్నారు. ఇదే జరిగితే ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద షాక్ గా మారనుంది. ఇప్పటికే పలువురు నేతలు టీఆర్ఎస్ ను వీడారు. ఇవన్నీ ఎన్నికల ముందు జరిగే పరిణామాలు గానే చూసుకున్నా...ఏ రాజకీయ నాయకుడు అయినా గెలిచే అవకాశాలు ఉన్న పార్టీనీ వీడరనే విషయం తెలిసిందే.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు పార్టీకి అంత అనుకూలంగా లేకపోవటం ఒకెత్తు అయితే..టీఆర్ఎస్ పార్టీలో అసలు ప్రజాస్వామ్యం అన్నదే లేదని ఎక్కువ మంది నేతల వ్యాఖ్యలు. ఇదే విషయాన్ని వీడిన వారు బహిరంగంగా చెబుతుంటే...పార్టీలో ఉన్న వారు మాత్రం అంతర్గత చర్చల్లో ఈ విషయాన్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా అంగీకరిస్తున్నారు. పార్టీని వీడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత కొంత కాలంగా ప్రచారంలో ఉన్న అంశాలను ప్రస్తావించారు. టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాంటిది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీని వీడే ఎంపీల్లో ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లు కొన్ని అయితే...మరికొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయని చెబుతున్నారు.

Next Story
Share it