Telugu Gateway
Politics

అందరి ఆమోదంతోనే రాజకీయాల్లోకి

అందరి ఆమోదంతోనే రాజకీయాల్లోకి
X

అనూహ్యంగా ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణ తెలుగుదేశం తరపున కూకట్ పల్లి అసెంబ్లీ సీటు దక్కించుకున్న నందమూరి సుహాసిని శుక్రవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. శనివారం నాడు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను ఎన్నికల బరిలో నిలవటానికి కుటుంబంలోని అందరి ఆమోదం ఉందని..అది ఉండబట్టే ఇలా బయటకు వచ్చానని వ్యాఖ్యానించారు. కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తుండటం గర్వంగా ఉందని చెప్పారు.

తన తాత ఎన్టీఆర్‌, నాన్న హరికృష్ణ స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చానని.. ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడతానన్నారు. ప్రజలకు సేవ చేస్తానన్న నమ్మకంతోనే తనకు సీటు ఇచ్చారని తెలిపారు. నామినేషన్‌ వేసిన తర్వాత మీడియా ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెబుతానని అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ప్రచారానికి వస్తారా? అని అడగ్గా రేపు అన్ని చెబుతానన్నారు. సుహాసినితో పాటు ఆమె బాబాయ్‌ నందమూరి రామకృష్ణ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Next Story
Share it