సుదర్శన చక్రం సర్వీసింగ్ కు ఇచ్చా..!
BY Telugu Gateway1 Nov 2018 12:58 PM IST

X
Telugu Gateway1 Nov 2018 12:58 PM IST
సవ్యసాచి సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన కామోడీ టీజర్ నవ్వులు పూయిస్తోంది. కాలేజీలో నాటకం సందర్భంగా వచ్చే డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తున్నాయి. సుదర్శన చక్రం సర్వీసింగ్ కు ఇచ్చా లేకపోతేనా? అంటూ వెన్నెల కిషోర్ డైలాగు ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. నాగచైతన్యకు జోడీగా తొలిసారి తెలుగులో నిధి అగర్వాల్ నటిస్తోంది.
చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. సుబధ్ర పరిణయం నాటాకానికి సంబంధించిన స్వల్ప నిడివి టీజర్ ను గురువారం నాడు విడుదల చేశారు. నాగ చైతన్య అర్జునుడిగా కనిపించగా వెన్నెల కిశోర్ కృష్ణుడిగా అలరించాడు. హైపర్ ఆది, సుదర్శన్, విధ్యుల్లేఖ రామన్, వైవ హర్ష ఇతర పౌరాణిక పాత్రల్లో తమవంతు కామెడీ పండించారు.
https://www.youtube.com/watch?time_continue=9&v=fkuu_vD93S8
Next Story



