చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ
BY Telugu Gateway1 Nov 2018 4:06 PM GMT

X
Telugu Gateway1 Nov 2018 4:06 PM GMT
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబుతో ఈ భేటీ జరిగింది. రాహుల్, చంద్రబాబు భేటీపై రేవంత్ స్పందించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే వీరిద్దరి భేటీ జరిగిందని అన్నారు. రాష్ట్రం కోసం..దేశం కోసం త్యాగాలు చేసిన నాయకులు కలిశారన్నారు.
కేంద్రంతోపాటు రాష్ట్రంలో కూడా ఇద్దరూ కలసి పనిచేస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసీఆర్, జాతీయ స్థాయిలో మోడీ ప్రమాదకరంగా పరిణమించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు కలసి పనిచేస్తే దేశానికి బలమైన నాయత్వం ఇవ్వొచ్చని అన్నారు. గతంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసిన చరిత్ర టీడీపీకి ఉందన్నారు.
Next Story