Telugu Gateway
Cinema

అమర్..అక్భర్..అంటోనీ ట్రైలర్ విడుదల

అమర్..అక్భర్..అంటోనీ ట్రైలర్ విడుదల
X

రవితేజ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అయిపోయాడు. ఈ సారి అమర్..అక్భర్..అంటోనీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత రవితేజ, ఇలియానా జంటగా చేసిన సినిమా ఇది. ఈ కొత్త సినిమా నవంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ రవితేజ మూడు పాత్రలకు చెందిన అంశాలతో ఆసక్తికరంగా ఉంది.

మైత్రీ మూవీమేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కించారు. ‘ ఈ ప్రపంచంలో శక్తిచాలక నమ్మకం నిలబెట్టుకోలేని వారరు కొందరు అంటే..శక్తి మేరకు నయవంచన చేసే వాళ్ళు కోకొల్లలు’ అంటూ వచ్చే డైలాగుతో ట్రైలర్ ఆకట్టుకుంటుంది ట్రైలర్ లో వెన్నెల కిషోర్..సునీల్ ల కామెడీ డైలాగూలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=s3Q6AM4MDs4

Next Story
Share it