రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
BY Telugu Gateway7 Nov 2018 5:27 PM IST
X
Telugu Gateway7 Nov 2018 5:27 PM IST
ప్రచారమే నిజం అయింది. రామ్ చరణ్, బాలీవుడ్ భామ కైరా అద్వానీ జంటగా నటించే సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. ఈ సినిమా టైటిల్ ‘వినయ విధేయ రామ’గా నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు.
డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపావళి సందర్భంగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ చరణ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో స్నేహ, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Next Story