Telugu Gateway
Cinema

భయపెడుతున్న రాయ్ లక్ష్మీ

భయపెడుతున్న రాయ్ లక్ష్మీ
X

ఐటెం సాంగ్స్ తోపాటు..హాట్ హాట్ సినిమాలతొ ప్రేక్షకులను అలరించే రాయ్ లక్ష్మీ ఈ సారి ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. విచిత్రం ఏమిటంటే రాయ్ లక్ష్మి నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లు ఆదివారం నాడే విడుదల అయ్యాయి. అందులో ఒకటి ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’అయితే..మరొకటి తమిళంలో తెరకెక్కుతున్న ‘సిండ్రల్లా’. ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తున్నాడు.

పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను యంగ్ హీరో నితిన్‌ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. సిండ్రిల్లా ఫస్ట్ లుక్ ను స్వయంగా రాయ్ లక్ష్మీనే విడుదల చేశారు. ఈ సినిమా హారర్ జానర్ లో తెరకెక్కనుంది. ఈ ఫస్ట్ లుక్ చూడటానికే భయం పుట్టించేలా ఉంది.

Next Story
Share it